Asianet News TeluguAsianet News Telugu

ప్రతిఘటనకు ప్రతీక.. రోహిత్ వేముల నా హీరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

రోహిత్ వేముల ప్రతిఘటనకు ఒక చిహ్నం అని, ఆయన తనకు హీరో అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రోహిత్ వేములను వివక్షతో చంపేశారని తెలిపారు. దళిత ఐడెంటిటీపై ఉన్న వ్యతిరేకత, చిన్న చూపే ఆయన మరణానికి కారణం అయిందని వివరించారు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా.. ఆయన పోరాటానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కాగా, ఆయన తల్లి.. హోప్‌కు సింబల్ అని వివరించారు.
 

rohit vemula is my hero says congress leader rahul gandhi
Author
New Delhi, First Published Jan 17, 2022, 2:05 PM IST

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) స్టూడెంట్ రోహిత్ వేముల(Rohit Vemula) దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. అన్ని యూనివర్సిటీల్లోనూ రోహిత్ వేముల మరణం(Suicide)పై నిరసనలు వెల్లువెత్తాయి. దళితుల(Dalit) స్వరం మరోసారి బలంగా వినపడింది. ఆయన మరణించి ఆరేళ్లు గడిచింది. తాజాగా, ఆయన ఆరో వర్ధంతి సందర్భంగా దళిత కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని రాజకీయ పార్టీలూ ఆయనను స్మరించుకున్నాయి. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా దళిత స్కాలర్ రోహిత్ వేములను గుర్తు చేసుకున్నారు.

రోహిత్ వేములను వివక్షతోనే హత్య చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన దళిత అస్తిత్వంపై చూపిస్తున్న వ్యతిరేకతనే ఆయనను అంతమొందించిందని వివరించారు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా.. ప్రతిఘటనకు ఆయన ఇంకా చిహ్నంగా నిలిచి ఉన్నాడని తెలిపారు. ఆయన తల్లి ఆశావాహానికి ఒక ప్రతీకగా ఉన్నారని ట్వీట్ చేశారు. కడ దాకా పోరాడిన రోహిత్ వేముల తనకు హీరో అని వివరించారు. 2016 జనవరి 17వ తేదీన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఆయనది వ్యవస్థీకృత హత్య అని ఇక్కడి మేధావులు పేర్కొన్నారు. 

యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఓ గొడవ కారణంగా రోహిత్ వేములతోపాటు మరో నలుగురిని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. 12 రోజుల తర్వాత రోహిత్ వేముల తన గదిలో విగత జీవిగా కనిపించారు. ఉరి వేసుకుని తన గదిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో యూనివర్సిటీ అధికారుల వివక్షతను పేర్కొన్నారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు చెలరేగాయి. హైదరాబాద్, ఢిల్లీలో విద్యార్థుల సారథ్యంలో జరిగిన ఆందోళనల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అప్పుడు రోహిత్ వేముల మరణంపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన యూనివర్సిటీలను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆయన అననారు. రోహిత్ వేముల గళాన్ని నులిమేశారని పేర్కొన్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థుల గొంత నొక్కకుండా రక్షణ కల్పించే ఓ చట్టం మనకు అవసరం అని వివరించారు. రోహిత్ వేముల దేశ భవిష్యత్ గురించి కలలు కన్నాడని తెలిపారు. కానీ ఆర్ఎస్ఎస్ వాటికి మద్దతు ఇవ్వదని, కానీ, గతించిన కాలం గురించే అది మాట్లాడుతుందని ఆరోపించారు.

 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు.దళితుల సమస్యసలను ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని, రోహిత్ వేముల మరణించినప్పుడు ప్రధాని నోరు కూడా మెదపలేదని అన్నారు. ప్రధాని అభ్యర్థి విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. కాషాయికరణపై తొందరపాటులో ఏదో అన్నందుకే రోహిత్ ను  క్యాంపస్‌ నుంచి పంపించారని అన్నారు. అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. బీజేపీపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన రోహిత్‌ వేములను  వేధించే అధికారం ఆ పార్టీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios