మీరు భారత్‌కు రావడం సంతోషంగా వుంది.. రాక్ లెజెండ్ మిక్ జాగర్‌కు మోడీ థ్యాంక్స్, ట్వీట్ వైరల్
దిగ్గజ రాక్‌స్టార్, రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్ భారత పర్యటనకు వచ్చారు . రోజువారీ దినచర్యకు దూరంగా, ఇక్కడ వున్నందుకు నాకు చాలా సంతోషంగా వుందని మిక్ జాగర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోడీ థ్యాంక్స్ చెప్పారు.
మీరు భారత్‌కు రావడం సంతోషంగా వుంది.. రాక్ లెజెండ్ మిక్ జాగర్‌కు మోడీ థ్యాంక్స్, ట్వీట్ వైరల్
rock legend mick jagger shares a thank you india note pm narendra modi replies ksp
దిగ్గజ రాక్‌స్టార్, రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్ భారత పర్యటనకు వచ్చారు. అంతేకాదు.. శుక్రవారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌లో హిందీ పాటను పంచుకున్నారు. ‘‘ ధన్యవాదాలు , నమస్తే ఇండియా. రోజువారీ దినచర్యకు దూరంగా, ఇక్కడ వున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మీ అందరికీ ప్రేమతో మిక్ ’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. మీరు కోరుకున్నది మీరు ఎప్పుడూ పొందలేరు.. కానీ భారతదేశం అన్వేషకులతో నిండి వుంది. అందరికీ ఓదార్పు, సంతృప్తిని ఇస్తుంది. భారతీయ సంస్కృతిలో ఆనందాన్ని పొందారని తెలుసుకోవడం ఆనందంగా వుందని ప్రధాని ట్వీట్ చేశారు.
జాగర్ పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీనిని 6.5 లక్షల మంది వీక్షించారు. నవంబర్ 11న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మ్యాచ్‌ను జాగర్ వీక్షించారు. జాగర్ భారతదేశ పర్యటన సందర్భంగా కోల్‌కతాను సందర్శించారు. దాదాపు దశాబ్ధ కాలంలో రెండోసారి కోల్‌కతాను సందర్శించారు. నగర వీధుల్లో తిరుగుతూ దీపావళి వేడుకలను తిలకించారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రాశారు. దీపావళి , కాళీ పూజ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
మిగ్ జాగర్ తన హిట్ పాటలతో రాక్ ప్రపంచంలో తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. వీటిలో ‘‘సింపతి ఫర్ ది డెవిల్ ’’ , ‘‘ యు కెన్ట్ ఆల్వేస్ గెట్ వాట్ యు వాంట్’’, ‘‘గిమ్మ్ షెల్టర్ ’’లు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. మిగ్ జాగర్‌కు 2002లో నైట్ హుడ్ లభించింది.