పెట్రో బాదుడు ప్రజల్ని బెంబెలెత్తిస్తోంది. పెట్రోల్ ధర సెంచరీ కొట్టడంతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇది ఇంతటితో ఆగకుండా రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మీద అనేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

"

ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలకు నిరసన గా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, ఢిల్లీ వీధుల్లో సైకిల్ తొక్కారు. తను రోజూ ఆఫీసుకు వెళ్లడానికి కారు వాడతాను కానీ పెరిగిన పెట్రోల్ ధరలు తనను కారు వాడడానికి భయపెట్టేలా చేశాయని, అందుకే కార్యాలయానికి ఇలా సైకిల్ మీద వెడుతున్నానని చెప్పుకొచ్చారు.