క్వారంటైన్ సెంటర్‌లలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా క్వారంటైన్ సెంటర్‌లో ఓ మహిళకు చెందిన రూ.3.5 లక్షల సొమ్మును దొంగలు దోచుకున్నారు.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోంబివాలాకు చెందిన 34 ఏళ్ల మహిళకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో పిల్లలతో కలిసి క్వారంటన్ కేంద్రంలో జాయిన్ అయ్యింది.

అక్కడ పరీక్షల నిమిత్తం తాను బస చేస్తున్న గది నుంచి పిల్లలతో కలిసి మరో చోటికి వెళ్లింది. టెస్టులు పూర్తి చేసుకుని తిరిగి తన గదికి వచ్చి చూస్తే.. మంగళసూత్రం, రెండు చైన్‌లు, నాలుగు వేల రూపాయల నగదు కనిపించలేదు.

దీంతో ఆమె క్వారంటైన్ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.