కర్ణాటకలో దారుణం జరిగింది. టు లెట్ బోర్డు పెట్టి ఉన్న ఇంటిలోకి వెళ్లి ఇల్లు అద్దె కోసం అడ్వాన్స్ ఇచ్చి మరీ ఇంటిలోని విలువైన వస్తువులను దొంగిలించారు.
బెంగళూరు: కర్ణాటకలో ఓ కొత్త తరహా చోరీ వెలుగులోకి వచ్చింది. దొంగలు సరికొత్త పద్ధతులను ఎంచుకుని తమ దోపిడీ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారని ఈ ఘటన స్పష్టం చేసింది. టు లెట్ బోర్డు పెట్టిన ఇల్లులోకి వాళ్లు వెళ్లారు. రూమ్ కావాలని అడిగారు. ఆ రూమ్ రెంట్ కోసం అడ్వాన్స్ కూడా పే చేశారు. అనంతరం ఓ వారం తర్వాత ఆ గ్యాంగ్ మళ్లీ అదే ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్నవారిని కాళ్లు చేతులు కట్టేసి నిర్బంధించారు. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని తుమకూరు నగరంలో ఈ నయా విధానంలో చోరీ జరిగింది. నగరంలోని రింగ్ రోడ్డు వద్ద దుర్గప్ప అనే వ్యక్తి కుటుంబ సమేతంగాా అక్కడే జీవిస్తున్నాడు. సొంత ఇంటితో సెటిల్ అయ్యాడు. అయితే, ఓ పోర్షన్ ఖాళీగానే ఉన్నది. ఆ ఖాళీ పోర్షన్‌ను అద్దెకు ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంటి ఎదుట టు లెట్ బోర్డు పెట్టాడు.
కొందరు దుండగులు ఈ టు లెట్ బోర్డు చూశారు. టు లెట్ బోర్డు ఆధారంగా ఓ దోపిడీని స్కెచ్ వేశారు. వారు దుర్గప్ప దగ్గరకు వెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని మాట్లాడారు. వారం క్రితం ఓ జంట సహా ఐదుగురు దుండగులు దుర్గప్పతో మాట్లాడారు. అంతేకాదు, ఇల్లు చూసిన తర్వాత అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.
మధ్యలో ఇంకోసారి వాళ్లు ఆ ఇంటికి వెళ్లారు. మరోసారి ఇల్లు చూస్తామని చెప్పారు. కానీ, ఈ సారి దోపిడీ చేయడానికే వెళ్లారు. దుర్గప్ప భార్య కాళ్లు, చేతులు కట్టేశారు. ఇంట్లోని 70 గ్రాముల బంగారాన్ని వారు దొంగిలించారు. 70 గ్రాముల బంగారు గొలుసుకుని దోచుకున్న ఆ ముఠా పరారయ్యారు.
దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయనగర్ పోలీసులకు వారు ఫిర్యాదు ఇచ్చారు. గాలింపులు చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలో కేసులో పురోగతి సాధించారు. రెండు రోజుల కిందట పోలీసులు ప్రమోద్, అతని భార్య హేమలత, రమేష్, సౌజన్యం, తీర్థేశ్ నిందితులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
