తమిళనాడులో దుండగులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. మధురై తిరునగర్‌లో గురువారం అర్థరాత్రి హైవేకు రోడ్డుకు అడ్డంగా దుండగులు బండలు పెట్టారు. చీకటితో పాటు పాటు వేగంగా వస్తుండటంతో ఓ వాహనదారుడికి బండలు కనిపించకపోవడంతో వారి వాహనం వాటిని ఢీకొట్టింది. దీంతో వాహనదారుడు కిందపడిపోయాడు.

ఆ వెంటనే అతని బ్యాగులో ఉన్న నగదుతో సహా దుండగుడు ఊడాయించాడు. తొలుత అందరూ దీనిని యాక్సిడెంట్‌గా భావించారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.