Asianet News TeluguAsianet News Telugu

సినీ ఫక్కీలో చోరీ.. సీబీఐ అధికారులమంటూ వ్యాపారికి టోకరా

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత నగర శివార్లలోని భవానీపూర్‌లో ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేసిన నకిలీ సిబిఐ ముఠా దాడి చేసింది. సోదాల పేరుతో దాదాపు రూ. 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ వ్యాపారి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ నకిలీల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు

Robbery by fake CBI team in Bhowanipore in West bengal
Author
First Published Dec 13, 2022, 3:09 PM IST

పశ్చిమ బెంగాల్ నకిలీ సిబిఐ  ముఠా హల్చల్ చేసింది. ఓ వ్యాపారి ఇంటిపై సోదాలపై దాడి చేసి.. 30 లక్షలతో పాటు లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన  కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ వ్యాపారి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ నకిలీల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని నివాసితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ వాధ్వా అనే వ్యక్తి భవానీపూర్‌లోని రూప్‌చంద్ ముఖర్జీ లేన్‌లో నివసిస్తున్నారు. ఆయన వృత్తిరీత్యా ఆహార పదార్థాలు, రసాయనాల వ్యాపారి. సోమవారం ఉదయం 8:30 ప్రాంతంలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది అపరిచిత వ్యక్తులు మూడు కార్లలో అతని ఇంట్లోకి చొరబడ్డారు. తాము సీబీఐ నుంచి వస్తున్నామని, తమ వద్ద సెర్చ్ వారెంట్ ఉందని బెదిరించి, అల్మీరా తాళం తీసికెళ్లారు. సోదాల పేరుతో ఇంట్లోని సుమారు ముప్పై లక్షల రూపాయల నగదు, నగలు ఎత్తుకెళ్లారని తెలిపారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ వ్యాపారి .. ఈ సంఘటన జరిగిన మూడు, నాలుగు గంటల తర్వాత.. ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లాల్‌బజార్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. బంగారం, డబ్బు కోసం వచ్చిన నకిలీ సిబిఐ ముఠాకి, వారి కుటుంబం గురించి తెలిసిన వ్యక్తికి సంబంధం ఉన్నట్టుగా ఉందనీ, ఆ ముఠాకు ఇంట్లో చాలా నగదు, నగలు ఉన్నాయని ముందుగానే తెలిసి ఉంటుందని, చాలా దగ్గరి వారు చేసిన పనిలా ఉందని అన్నారు. 
 
 సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు 

ఆ ఇంట్లో సీసీ కెమెరా లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఆ ప్రాంతంలోని కొన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఓ ఫుటేజీలో.. వ్యాపారవేత్త ఇంటి ముందు కారు ఆపి, నలుగురు వ్యక్తులు కారులో దిగడం కనిపించింది. మరికొద్ది దూరంలో మరో రెండు వాహనాలు పార్క్ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నకిలీ సీబీఐ ముఠా వ్యక్తులు హిందీ, బంగ్లా కలిపి మాట్లాడుతున్నారని వ్యాపారి పోలీసులకు తెలిపాడు.

వారందరూ మాస్క్ లు ధరించరనీ, వారి చేతుల్లో చిన్న కర్రలు ఉన్నాయని తెలిపారు. అయితే.. వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని ఫిర్యాదుదారుడు తెలిపారు. ఇంటికి తరచుగా వచ్చేవారి నుంచి వచ్చిన ఆధారాలు, ఇంటికి తెలిసిన వారు ఎవరైనా పక్కా సమాచారంతో ఇంటిపై దాడి చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios