Asianet News TeluguAsianet News Telugu

Navjot Singh Sidhu: సిద్దూ త‌రువాత నిర్ణ‌య‌మేమిటి.. లొంగిపోతాడా ? మ‌రో పిటిషన్ దాఖలు చేస్తాడా?

Navjot Singh Sidhu: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ త‌రువాత నిర్ణ‌య‌మేమిట‌నేది ఆసక్తిక‌రంగా మారింది. ఓ వైపు రేపు పాటియాలా కోర్టులో లొంగిపోనున్నారని వార్త‌లు వెలువ‌డుతుంటే.. మరోవైపు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.  
 

Road rage case Navjot Singh Sidhu likely to surrender before police tomorrow
Author
Hyderabad, First Published May 20, 2022, 12:40 AM IST

Navjot Singh Sidhu:  మూడు దశాబ్దాల నాటి కేసులో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు గురువారం ఏడాది జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రేపు పాటియాలా కార్ట్ వద్ద లొంగిపోనున్నారు. కోర్టు తీర్పు తర్వాత సిద్ధూకి ఇచ్చిన వై+ భద్రతను కూడా ఉపసంహరించునున్నారు.

గతంలో ఇదే 1988 నాటి 'రోడ్ రేజ్' కేసులో కోర్టు వెయ్యి రూపాయల జరిమానా వేసి నిర్దోషిగా వదిలేసింది. అయితే ఆ తీర్పును సమీక్షించాలని బాధిత కుటుంబం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇన్నేళ్ల పాటు విచారణ జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) కి ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే.. బాధితురాలి కుటుంబం రివ్యూ పిటిషన్ దాఖాలు చేయగా.. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. 

ఈ కేసులో 65 ఏళ్ల వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన నేరానికి సిద్ధూను మే 2018లో సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించినప్పటికీ, రూ. 1,000 జరిమానా విధించిన తర్వాత నిర్దోషిగా విడుదలైంది. దీనికి వ్యతిరేకంగా బాధితురాలి కుటుంబం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది, దానిని సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ రోజు సిద్ధూ ( Navjot Singh Sidhu) కి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచ‌లన తీర్పును వెలువ‌రించింది. 

ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాంగ్రెస్ నేత సిద్దూ ( Navjot Singh Sidhu) ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.  నేను చట్టాన్ని గౌరవిస్తాను అని ట్విట్ చేశారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ ప్రకారం.. సిద్ధూకు పోలీసుల ముందు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదు. సిద్ధూ లొంగిపోకుంటే పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత పాటియాలా జైలుకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈరోజు కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత మృతుడు గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.

గుర్నామ్ సింగ్ కోడలు పర్వీన్ కౌర్ మాట్లాడుతూ.. “మేము బాబా జీ (సర్వశక్తిమంతుడు)కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము దానిని బాబాజీకి వదిలిపెట్టాము. బాబా ఏం చేసినా సరైనదే. మేము  కోర్టు నిర్ణయంతో సంతృప్తి చెందాము.అని తెలిపింది. గుర్నామ్ సింగ్ మనవడు సబ్బీ సింగ్ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.

క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలుకు సిద్ధూకు అవకాశం 

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సిద్ధూకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయానికి ఇది చివరి న్యాయపరమైన దిద్దుబాటు ఎంపిక. కోర్టు నిర్ణయంపై తన స్పందన ఏమిటని ప్రశ్నిస్తే.. సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ, "కామెంట్ లేదు" అని అన్నారు. ఇది చట్టంపై ప్రజలకు విశ్వాసాన్ని తగ్గిస్తుంది. సంబంధిత పరిస్థితుల్లో ఎవరైనా సహనం కోల్పోయినా, సంయమనం కోల్పోయినా ఫలితం ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios