Uttar Pradesh: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Kedarnath: జాతీయ రహదారిపై ఆగివున్న ఓ ట్రక్కును కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు చూడా ఉన్నారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. newindianexpress నివేదించిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బులంద్‌షహర్-మీరట్ హైవేపై మంగళవారం ఉదయం ఆగివున్న ఉన్న ట్రక్కును వేగంగా నడుపుతున్న కారు ఢీకొనడంతో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కుటుంబం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా బులంద్‌షహర్‌లోని గులావతి ప్రాంతంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ట్రక్కును ఢీకొట్టిన మహీంద్రా స్కార్పియోలో కుటుంబంలోని 11 మంది సభ్యులు ఉన్నారని, ఇద్దరు పిల్లలు, ఒక మహిళ మరియు ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మరణించారని జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాష్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులలో ముగ్గురిని మీరట్‌లోని వైద్య కళాశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తాను, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ సింగ్‌తో కలిసి మైదానంలో ఉన్నట్లు డీఎం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతులను హార్దిక్ (6), వంశ్ (5), షాలు (21), హిమాన్షు (25), పరాస్ (22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలావుండగా, కర్నాటక (Karnataka) రాష్ట్రంలో మంగళవారం నాడు జరిగిన Road Accident లో ఏడుగురు మరణించారు. మరో 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని Hubballi శివారులో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఘటన స్థలంలోనే మరణించారు. ప్రయాణీకులతో బస్సు కొల్హాపూర్ నుండి బెంగుళూరు వెళ్తుంది.ఈ సమయంలో అర్ధరాత్రి ధర్వాడ్ వైపు వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు. అలాగే, ఈ నెల 21న కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో 21 మందితో కూడిన వాహనం బెంకనకట్టికి వెళ్తోంది. అయితే జిల్లాలోని నిగడి వద్ద వాహనం వెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
