తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్యాగదుర్గం వద్ద ఫ్లైఓవర్‌పై నుంచి కారు కింద పడటంతో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.