ఆర్టీసీ బస్సుని ఓ ట్రక్కు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు అలహాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా భాదోహీ గ్రామం సమీపంలోని చావనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య వల్ల బస్సు ఆగిపోగా, కొందరు ప్రయాణికులు కిందికి దిగి తోస్తున్నారు. ఈ సమయంలో అదుపు తప్పి వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆదేశించారు.