బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఓ ప్రైవేట్ అదుపు తప్పి బోల్తా పడడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని  కొరటగెరెలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. తుముకూరు హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ప్రైవేట్ బస్సు ఉడిపి నుండి మంగుళూరు వైపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రయాణీకుల్లో కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు కూడ ఉన్నారు.

బస్సును డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల వన్ వే రోడ్డుపై బస్సును అదుపు చేయడం కష్టంగా మారింది తమ గమ్యస్థానాలకు చేరేందుకు  బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతి వేంగా బస్సును నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని క్షతగాత్రులు తెలిపారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణీకులు ఉన్నారు.

బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో ఎక్కువగా విద్యార్ధులు ఉన్నారు. ఈ  బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఎనిమది మందిలో నలుగురు విద్యార్ధులు మరో నలుగురు సాధారణ  పౌరులని స్థానికులు చెప్పారు. 

కర్ణాటక రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తుముకూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు.ఈ రోడ్లపై అవగాహాన లేని డ్రైవర్లు అతి వేగంగా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టుగా అధికారులు చెప్పారు.