మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీ కొట్టుకోవడంతో పది మంది అక్కడిక్కడే మృతి చెందారు. గ్వాలియర్ పూరాణి చవాణీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెడితే.. మంగళవారం తెల్లవారు జామున కూలీలతో వెల్తున్న ఆటో, బస్సును ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు సుమారు 10 మంది మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదం ధాటికి ఆటో నుజ్జు నుజ్జయ్యింది. ఐరన్ ముద్దలా మారిపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. 

దీనిమీద సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. ‘ఆటో రిక్షా ఓవర్ లోడ్ లో వెల్తోంది. ఆటోలో సుమారు 13మంది మహిళలే ఉన్నారు. వీరంతా ఓ ఫంక్షన్‌లో వంట చేయడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొరేనా నుంచి అతి వేగంగా వస్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది’’ అని తెలిపారు.