గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లాలోని భవాచ్ జాతీయ రహదారిపై ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది..

అదే సమయంలో అటుగా వస్తున్న మరో ట్రక్కు కూడా కారును ఢీకొట్టింది. దీంతో రెండు ట్రక్కుల మధ్య చిక్కుకుని కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..

భుజ్‌లోని తమ స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.