దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉదయం 11 గంటలు కావోస్తున్నా చాలా ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో జనం చలికి వణికిపోతున్నారు.

మరోవైపు భారీగా కమ్మేసిన పొగమంచు కారణంగా రోడ్డుపై దారి కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఇవాళ ఉదయం అంబాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి, ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

చంఢీగఢ్‌ వైపు నుంచి వస్తోన్న రెండు వాహనాలు దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొని మరొ వాహనంపైకి దూసుకెళ్లాయి. దీనిని గమనించిన తోటి వాహనదారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, సోమవారం హర్యానాలోనూ పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.