ఘోర రోడ్డు ప్రమాదం: ఎస్ యూవీ-ట్రక్కు ఢీ.. నలుగురు మృతి
Bangalore: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ యూవీ, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారనీ, మంగళూరు- బెంగళూరు జాతీయ రహదారిపై హసన్ జిల్లా ఆలూరు తాలూకా ఈశ్వరహళ్లి కుడిగె సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

Road Accident: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ యూవీ, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారనీ, మంగళూరు- బెంగళూరు జాతీయ రహదారిపై హసన్ జిల్లా ఆలూరు తాలూకా ఈశ్వరహళ్లి కుడిగె సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. మంగళూరు-బెంగళూరు జాతీయ రహదారిలో హాసన్ జిల్లా ఆలూరు తాలూకాలోని ఈశ్వరహళ్లి కుడిగె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందతి. ఎస్‌యూవీ, టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ బస్సు)ను ఓవర్‌టేక్ చేస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఒక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు తాలూకా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జానుబాయి కడాట్టి తెలిపారు. గ్రామస్తులు అప్పటికే గాయపడిన ముగ్గురిని ఆలూరు ఆసుపత్రికి తరలించారనీ, అయితే ముగ్గురూ ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన వివరాలు ప్రస్తావించే ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శుక్రవారం రాత్రి బంధువులకు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది తర్వాత జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడం ఇదే తొలిసారి.
కాగా, మృతులను కుప్పిలి గ్రామానికి చెందిన చేతన్, గుడ్డెనహళ్లి గ్రామానికి చెందిన అశోక్, తాట్టెకెరె గ్రామానికి చెందిన పురుషోత్తం, ఆలూరు తాలూకా చిగలూరు గ్రామానికి చెందిన దినేష్ గా పోలీసులు గుర్తించారు. వీరు సకలేశ్ పుర నుంచి ఆలూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చేతన్ నడుపుతున్న కారు వర్షం పడుతుండటంతో కారును అదుపు చేయలేక ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను ఢీకొట్టాడు. చేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. హసన్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈశ్వరపల్లి వద్ద ఎన్ హెచ్ 75 పక్కన ఉన్న హోటల్ లో టీ తాగుతుండగా భారీ వర్షం పడిందనీ, ఇన్నోవా కారు హసన్ వైపు వెళ్తోందని ప్రత్యక్ష సాక్షి బి.రామనాథ విలేకరులకు తెలిపారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో కారు కేఎస్ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసిందనీ, కేవలం 10 మీటర్ల దూరంలోనే ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైందనీ, కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని తెలిపారు.