లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ నుండి చౌదర్ పూర్ కు పశువుల లోడ్ తో వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మూగజీవాలతో పాలు ఆరుగురు మృతి చెందారు. 

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ జిల్లా గజరౌలా ప్రాంతంలో కంటైనర్ బోల్తా పడింది. కంటైనర్ వేగంగా వెళుతున్న సమయంలో టైర్ పేలడంతో అదుపుతప్పింది. దీంతోడ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోయాడు. దీంతో కంటైనర్ బోల్తాపడగా అందులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా 12 మూగజీవాలు కూడా చనిపోయాయి. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేశారు.