మోడికి మరో షాక్: ఎన్డీఏకు ఫ్యాన్ గుడ్‌బై

rlsp Quits from nda
Highlights

మోడికి మరో షాక్: ఎన్డీఏకు ఫ్యాన్ గుడ్‌బై

ప్రధాని నరేంద్రమోడీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు టైం బాగోలేదనుకుంటా.. వారిద్దరూ ఏం చేసినా కలిసిరాకపోగా.. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండటంతో ఎన్డీఏ మిత్రపక్షాలు తలో దారిని చూసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఏమంత సులువు కాదని గ్రహించిన మోడీ షాలు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలాంటి సమయంలో ఈ జంటకు ఊహించని షాక్ తగిలింది.ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు బీహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది.

ఇప్పటికే సీఎం నితీశ్ కుమార్ వైఖరిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ.. 2019లో ఎన్డీఏ సారథిని తానేనంటూ నితిశ్ ప్రకటించడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగనున్న ఎన్డీఏ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో నిర్ణయించాలని కొద్దిరోజుల క్రితం ఆర్ఎల్ఎస్పీ కోరిండం ఎన్డీఏ పక్షాల్లో చర్చకు దారి తీసింది.

loader