Asianet News TeluguAsianet News Telugu

తాతకు భారత రత్న.. బీజేపీతో పొత్తు ఆఫర్‌ను కాదనలేను: ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి

యూపీలో ఆర్ఎల్డీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంలోని మాజీ పీఎం బీజేపీ చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న అవార్డు ప్రకటించడంతో చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి పార్టీ ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తుకు సై అన్నది. సమాజ్‌వాదీతో తెగదెంపులు చేసుకుంది.
 

rld decided alliance with bjp after union govt announced bharat ratna award to chaudhary charan singh kms
Author
First Published Feb 9, 2024, 8:12 PM IST

Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం పీవీ నర్సింహరావు, ఎంఎస్ స్వామినాథన్‌తోపాటు చౌదరి చరణ్ సింగ్‌కూ భారత రత్న అవార్డును ప్రకటించింది. చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించాలని ఆయన కుటుంబం, వారు స్థాపించిన పార్టీ బలంగా డిమాండ్ చేస్తున్నది. తాజాగా, కేంద్రం ఈ డిమాండ్‌ను నెరవేర్చింది. దీంతో చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి పార్టీ ఆర్ఎల్డీ యూటర్న్ తీసుకున్నారు. నిన్నటి వరకు ఆయన యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో ఉన్నారు. కానీ, చౌదరి చరణ్ సింగ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించిన తర్వాత ఆర్ఎల్డీ యూటర్న్ తీసుకుంది.

ఆర్ఎల్డీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎక్కువ సీట్లు ఆఫర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది రెండు మూడు రోజులుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆర్ఎల్డీ అప్పటికే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో ఉన్నది. 2019 ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. 

Also Read: CM Revanth Reddy: గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడాలని..కానీ.. : సీఎం రేవంత్ రెడ్డి

పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీకి మంచి పట్టు ఉన్నది. జాట్‌లు, రైతుల్లో మంచి ఆదరణ ఉన్నది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో మెజార్టీ స్థానాల్లో గెలిచినా.. ఓడినవి మాత్రం ఈ పశ్చిమ యూపీలోని స్థానాలే. అందుకే ఈ సారి 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ పశ్చిమ యూపీలోనూ సత్తా చాటాలని అనుకుంటున్నది. అందుకోసమే ఆర్ఎల్డీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసిందని రాజకీయ వర్గాలు తెలిపాయి.

అయితే.. ఈ వార్తలను ఇటు ఆర్ఎల్డీ, అటు సమాజ్‌వాదీ పార్టీ ఖండించాయి. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి విద్యావంతుడని, ఆయనకు రాజకీయాలు తెలుసు కాబట్టి బీజేపీతో జతకట్టబోడని ఎస్పీ పేర్కొంది. ఆర్ఎల్డీ నేతలు కూడా ఆ వార్తలను ఖండించారు.

Also Read: Explainer: పార్లమెంట్ క్యాంటీన్‌లో టీడీపీ, బీజేడీ, బీఎస్పీ ఎంపీలతో ప్రధాని లంచ్.. అసలు మతలబు ఇదేనా?

కానీ, ఇంతలోనే బీజేపీ మాస్టర్ స్కెచ్ వేసింది. ఆర్ఎల్డీ డిమాండ్‌లలో ఒక్కటైన చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించి తన గ్రిప్‌లోకి ఆ పార్టీని తెచ్చుకుంది.

బీజేపీతో పొత్తును తాజాగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ధ్రువీకరించారు. చరణ్ సింగ్‌ కు భారత రత్న ప్రకటించిన తర్వాత పొత్తు గురించి జయంత్ చౌదరిని అడగ్గా.. ‘బీజేపీ ఆఫర్‌ను ఇప్పుడు ఎలా కాదనగలను’ అని ఎదురు ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios