Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీయే కూటమిలోకి నితీష్ కుమార్ .. లాలూ ఏం చేయబోతున్నారు , దేనికైనా ఆర్జేడీ ఎమ్మెల్యేలు ‘‘ సై ’’ ..?

జేడీఎస్ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పొలిటికల్ గేమ్‌తో బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఇండియా కూటమిలో తలెత్తిన విభేదాలు.. బీహార్‌ల మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కూలిపోయేలా పరిణిమించింది. మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. 

RJD MLAs Authorise Lalu Yadav To Take All Decision Amid Bihar Political Crisis, Here's What Leaders Said ksp
Author
First Published Jan 27, 2024, 10:00 PM IST | Last Updated Jan 27, 2024, 10:07 PM IST

జేడీఎస్ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పొలిటికల్ గేమ్‌తో బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఇండియా కూటమిలో తలెత్తిన విభేదాలు.. బీహార్‌ల మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కూలిపోయేలా పరిణిమించింది. కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన నితీష్ కుమార్ .. ఇండియా కూటమి నుంచి తప్పుకుని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో తిరిగి చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. 

లాలూ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి వుంటామని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. లాలూ సతీమణి రబ్రీ దేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా ఈ విషయాన్ని తెలిపినట్లుగా పీటీఐ నివేదించింది. ఆరోగ్య శాఖను ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆయన ప్రశంసించారు. పార్టీ సమావేశానికి ఆర్జేడీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలంతా హాజరయ్యారు. 79 మంది ఎమ్మెల్యేల బలంతో ఆర్జేడీ బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా వున్న సంగతి తెలిసిందే. అలాగే మహాఘట్‌బంధన్‌లోనూ ఆ పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. 

 

 

పార్టీ నేతలతో సానుకూల సమావేశం జరిగిందని, అనేక విషయాలపై చర్చించామని మనోజ్ తెలిపారు. తామంతా నిర్ణయం తీసుకునే బాధ్యత లాలూకి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. లాలూ కుమార్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మాట్లాడుతూ.. ఏం జరగబోతోందో తనకు తెలియదని, ఎవరి నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. అయితే మా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అది బీహార్ కోసమే పనిచేస్తుందని భారతి స్పష్టం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించామని, రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లోనూ గెలుస్తామని యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. 

 

 

నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయు తన మద్ధతును ఉపసంహరించుకుంటే మహాఘట్‌బంధన్ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీకి 8 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు. దీంతో కూటమి మనుగడ కష్టమే. అయితే నితీష్ మరో ఎత్తువేసి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో చేరవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మీడియాలో వస్తున్న కథనాలను బట్టి.. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. 

ఆదివారం పాట్నాలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో తిరిగి చేరుతున్న ఆయన .. స్పీకర్ పోస్ట్‌తో పాటు రెండు డిప్యూటీ సీఎం పదవులను బీజేపీకి ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదివారం జేడీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నాను నితీష్ కుమార్. 

బీజేపీకి చెందిన రేణుదేవి, సుశీల్ మోడీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. దీంతో బీహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే ముందు నితీష్ కుమార్ జేడీయూ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ, సచివాలయాన్ని తెరిచే వుంచాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios