హిందూవుల పవిత్ర గ్రంధం రామయణంపై మరో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ (Ritlal Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు.రామచరితమానస్' (Ramacharitmans)ను  మసీదులో రాశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'రామచరితమానస్' (Ramacharitmans)ను తుగులబెట్టాలంటూ, అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేసే పుస్తకమిదని ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ (Ritlal Yadav) ఆ వివాదాన్ని తిరగదోడారు. అతడు కూడా రామచరితమానస్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేయడంతో బీహార్ రాజకీయాలను వేడెక్కించింది. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ మాట్లాడుతూ.. మసీదులో రామచరితమానస్‌ను రాశారని, తన వ్యాఖ్యలు వాస్తవమో కాదో తెలుసుకోవాలనుకుంటే చరిత్ర పుస్తకాలను తెచ్చుకుని తనిఖీ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీపై రిత్లాల్ యాదవ్ ఫైర్ 

బీజేపీ నేతలు ముస్లింలను ద్వేషిస్తున్నారని, హిందూ-హిందుత్వ గురించి మాట్లాడుతున్నారని దానాపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ అన్నారు. బీజేపీలో ఉన్న ముస్లింలందరినీ తరిమి కొడుతున్నారనీ, మసీదులో రామచరితమానస్ ను రాశారనీ, కావాలంటే.. చరిత్రను పరిశీలించండని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జేడీయూ ఆగ్రహం 

రామచరితమానస్‌పై ఆర్జేడీ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యపై జేడీయూ విరుచుకుపడింది. జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా మాట్లాడుతూ.. ప్రజలు తమ సౌలభ్యం మేరకే ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రకటనలు ఇస్తారని అన్నారు. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ఏ వ్యక్తి అయినా ఏ మతంలోనైనా విశ్వాసం కలిగి ఉండవచ్చు. ఇది ప్రజల వ్య క్తిగత విషయమని మతం పేరుతో ఉద్రిక్తత సృష్టించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రిట్లాల్‌కు బీజేపీ స్ట్రాంగ్ రిప్లే 

ఈ వివాదంపై బీజేపీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చింది. రిట్లాల్ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ రంజన్ పటేల్ కౌంటర్ ఇస్తూ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం హిందూ సనాతన ధర్మమని అన్నారు. దీని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వీకరించారు. ఆ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రామచరిత్మానాలపై వాక్చాతుర్యం చేసే వారికి జ్ఞానం కావాలి. మొదట వాస్తవాలను తెలుసుకోండి. ఆపై రామాయణం గురించి మాట్లాడండని హితవు పలికారు.

Scroll to load tweet…