పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదించడం నిరసనలో భాగమేననీ, అందులో మరో ఉద్దేశ్యం లేదని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి నినాదాలు చేసినంత మాత్రనా పాకిస్థానీలు కారని అన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదించడం నిరసనలో భాగమేననీ, అందులో మరో ఉద్దేశ్యం లేదని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి నినాదాలు చేసినంత మాత్రనా పాకిస్థానీలు కారని అన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ స్థావరాలపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఈ చర్యను నిరసిస్తూ పీఎఫ్‌ఐకి చెందిన కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు.
కాగా, మహారాష్ట్రలోని పూణెలో పీఎఫ్‌ఐ కార్యకర్తలు చేపట్టిన నిరసనలో కొందరు వ్యక్తులు ‘పాకిస్థాన్ జిందాబాద్’అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ అంశం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోపై దర్యాప్తు చేసి.. నిందితులపై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై విచారణ జరుగుతుంది. కాగా.. మహారాష్ట్రలో ఎవరైనా 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన వారిని విడిచిపెట్టామనీ, దేశద్రోహం కింద కేసు నమోదు చేశామని హోంమంత్రి ఫడ్నవీస్ తెలిపారు.అల్లర్లు, రోడ్లను దిగ్బంధించడం వంటి సెక్షన్ల కింద బుండ్‌గార్డెన్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పుణె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ పాటిల్ తెలిపారు. “వైరల్ అయిన వీడియోలకు సంబంధించి విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని పాటిల్ అన్నారు.
ఈ క్రమంలో ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు దారుణంగా మారాయని అన్నారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’నినాదాలు నిరసనలో భాగమే తప్ప మరొకటి కాదని అన్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదించిన మాత్రన నినాదాలు చేసేవారు పాకిస్థానీలు అవుతారని లేదా వారు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు కాదని వ్యాఖ్యానించారు.ఇతర దేశాల్లోని భారతీయులు దీని భారాన్ని భరించాల్సి వస్తోందనీ, వారిపై ద్వేషం వ్యక్తం చేశారు.
శివానంద్ తివారీ ప్రకటనను జేడీయూ స్పందన
అయితే, శివానంద్ తివారీ సంచలన ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు చెలారేగుతాయి. పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదంపై ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలపై వాక్చాతుర్యం వివాదాస్పదంగా మారింది. దీనిపై జేడీయూ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహను ప్రశ్నించగా.. దేశం విషయానికి వస్తే.. దేశ సమైక్యత కోసం ఒక్కటయ్యామని చెప్పారు. ఆర్జేడీ అధినేత ప్రకటన పూర్తిగా తప్ప అని అన్నారు.దేశ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లలేదని, ఇందులో కలిసిమెలిసి జీవిస్తున్నామని ఉమేష్ కుష్వాహ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్జేడీ ఇలాంటి ప్రకటనలు సరికాదన్నారు. తాను ఆ వివాదస్పద ప్రకటన వినకపోయినా.. అతను ఇలా మాట్లాడినట్లయితే అది పూర్తిగా తప్పు అని అన్నారు. ఇండియాలో అయితే మన హిందుస్థాన్ కోసమే హిందుస్థాన్ ప్రయోజనాలను ఆర్భాటం చేయాలని అన్నారు.
పిఎఫ్‌ఐపై ఇటీవల దేశవ్యాప్తంగా అణిచివేత, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల పిఎఫ్‌ఐ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసన సందర్భంగా దాదాపు 40 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గత వారం.. పిఎఫ్‌ఐ సంస్థలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నేతృత్వంలోని బహుళ-ఏజెన్సీ బృందాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 15 రాష్ట్రాల్లో దాదాపు ఏకకాలంలో దాడులు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థకు చెందిన 106 మంది నాయకులు,కార్యకర్తలను గురువారం అరెస్టు చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పలు కీలక ఆధారాలు ఎన్ఐఏ సేకరించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర, కర్ణాటకలలో 40 మందిని అరెస్టు చేయగా, తమిళనాడు (10), అస్సాం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4), పుదుచ్చేరి, ఢిల్లీ 3 చొప్పున, రాజస్థాన్ ( 2) 2006లో ఏర్పడిన PFI, భారతదేశంలోని అట్టడుగున ఉన్న వర్గాల సాధికారత కోసం ఒక నయా-సామాజిక ఉద్యమం కోసం కృషి చేస్తుందని పేర్కొంది మరియు రాడికల్ ఇస్లాంను ప్రోత్సహించే ఏజెన్సీలచే తరచుగా నిందించబడుతుంది.
