ఢిల్లీ: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు నూతన డైరెక్టర్ ను ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నూతన సీబీఐ డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను ఎంపిక చేసింది. 

అటు రిషి కుమార్ శుక్లా నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. గత కొంతకాలంగా సీబీఐ డైరెక్టర్ పదవిపై వివాదాలు నెలకొన్నాయి. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టింది సెలక్షన్ కమిటీ.