న్యూ ఇండియా జంక్షన్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.ఈ విషయాన్ని రిచా అనిరుధ్ రియల్ స్టోరీ పేరుతో వివరించారు.
న్యూఢిల్లీ: న్యూ ఇండియా జంక్షన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుండి భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయాన్ని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రిచా అనిరుధ్ పలు అంశాలను ప్రస్తావించారు. బీబీసీపై దాడులు, పెగాసెస్ వంటి అంశాలపై భారత్ కు వ్యతిరేకంగా న్యూ ఇండియా జంక్షన్ ద్వారా ప్రచారం చేసిన విషయాన్ని రిచా అనిరుధ్ ప్రస్తావించారు. రియల్ స్టోరీ విత్ రిచా అనిరుధ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Scroll to load tweet…
వాస్తవాలు బయటకు వస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుందని రిచా అనిరుధ్ అభిప్రాయపడ్డారు. నిరాధరమైన అంశంపై దేశ సమయాన్ని కూడ వృధా చేస్తున్నారు. ఒక తప్పుడు ప్రచారంపై వాస్తవాలు బయటకు రాగానే మరో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని రిచా అనిరుథ్ చెప్పారు. రియల్ స్టోరీ పేరుతో రిచా అనిరుథ్ కొన్ని ఎపిసోడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
