రోడ్డు ప్రమాదంలో ఓ బిచ్చగాడు మృతిచెందాడు. అనాథ శవం కదా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో సమాచారం ఇస్తే... పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  బిచ్చగాడే కదా అతని దగ్గర ఏముంటాయిలే అని సంచి వదిలస్తే.. డబ్బుల వర్షం కురిసింది. మొత్తం ఎంతున్నాయో చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో   చోటుచేసుకుంది. దీంతో.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ భిక్షకుడు మృతి చెందాడు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించి బిత్తరపోయారు. అందులో పెద్దమొత్తంలో డబ్బుంది. ఆ డబ్బును అక్కడికక్కడే లెక్కించారు. మొత్తం రూ. 1,86,43,364 నగదును పోలీసులు అక్కడికక్కడే లెక్కించారు. కాగా అంత డబ్బున్నప్పటికీ అతను ఇంకా భిక్షాటనే ఎందుకు చేస్తున్నాడన్నది పోలీసులకే కాదు, ఆ సందర్భం చూసినవారికందరికీ అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.  కాగా అతని వివరాలు మాత్రం తెలియరాలేదు.