: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల కేసులో సీల్డ్ కవర్లో  న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్‌ను గురువారం నాడు  అందించారు. ఈ అఫిడవిట్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారించనున్నారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల కేసులో సీల్డ్ కవర్లో న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్‌ను గురువారం నాడు అందించారు. ఈ అఫిడవిట్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారించనున్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణను ప్రారంభించింది.ఈ కేసు విషయంలో బాధితురాలి తరపున న్యాయవాది బెయిన్స్ సీల్డ్ కవర్లో పత్రాలను కోర్టుకు సమర్పించారు.తాను సమర్పించిన పత్రాల్లోని సమాచారాన్ని సాక్ష్యంగా పరిగణించాలని న్యాయవాది కోర్టును కోరారు.

బెయిన్స్ కోరుతున్న వాటికి భారత ఆధారాల చట్టం 126 వర్తించదని ఏజీ వేణుగోపాల్ అభ్యంతరం చెప్పారు.అయితే ఎలాంటి పత్రాలనైనా పరిశీలించే హక్కు కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

మరో వైపు మహిళ ఆరోపణలపైనా కూడ విచారించాలని కూడ న్యాయవాది ఇందిరా జైసింగ్ డిమాండ్ చేశారు.ధర్మాసనంపై బెయిన్స్ అఫిడవిట్ ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

న్యాయవ్యవస్థపై కుట్రలు చాలా తీవ్రతరమైనవేనని జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ధన, రాజకీయ శక్తితో సర్వోన్నత న్యాయస్థానం నడవదనే విషయం దేశానికి మొత్తం తెలుసునని జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు.బెయిన్స్ అఫిడవిట్‌పై ఇవాళ మధ్యాహ్నం సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.