ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎన్నికలు నిర్వహించిన తర్వాత అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలను కౌంటింగ్ దాకా రక్షించడం కత్తిమీద సాము వంటిది. ప్రత్యర్థులు, సంఘవిద్రోహ శక్తులు ఇలా ఎంతోమంది ఈవీఎంలను ఎత్తుకెళ్లడమో లేదా వాటిని ధ్వంసం చేయడం చేస్తుంటారు.

ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈవీఎంల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. కాగా మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలు ఉంచిన ప్రాంతాల్లో కాపలాగా ఉన్న రక్షణ సిబ్బంది ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కాల్చి పారేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆమె కాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌లను భద్రపరిచేందుకు వచ్చారు. ఈవీఎంలను పరిశీలించి అనంతరం సిబ్బందికి కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుం ప్రీతి మైథిలి వ్యవహారం మధ్యప్రదేశ్‌లో దుమారాన్ని రేపుతోంది.