ఉగ్రవాదుల దుశ్చర్య.. మసీదులో ప్రార్థనలు చేస్తుండగా రిటైర్డ్ పోలీస్ అధికారి హత్య..
Mohd Shafi : మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఓ రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులకు (Terrorists killed Retired police officer) పాల్పడ్డారు. దీంతో ఆయన మరణించాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో జరిగింది.
Mohd Shafi : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని ఓ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని కాల్చి చంపారు. మృతుడిని మహ్మద్ షఫీగా గుర్తించారు. ఆయన చాలా కాలం జమ్ముకాశ్మీర్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించారు. తరువాత ఉద్యోగ విరమణ పొందారు.
ఆయన బారముల్లాలోని షీరీ ప్రాంతంలోని గంట్ముల్లా గ్రామంలో ప్రార్థనలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందగానే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) లోని రాజౌరీ సెక్టార్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మూడు రోజుల్లోనే ఇలా రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ పై కాల్పులు జరగడం విచారకరం. కాగా రాజౌరీ సెక్టార్ లోని డేరా కీ గలీ అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
రూ.500కు గ్యాస్ సిలిండర్ పొందాలంటే.. ఆ కార్డు తప్పనిసరి ?
డిసెంబర్ 21న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందడంపై దర్యాప్తు చేస్తున్నామని భారత సైన్యం శనివారం తెలిపింది. దర్యాప్తు నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు టాప్ కమాండర్లను మట్టుబెట్టాయి.