ఓ రిటైర్డ్ నేవీ ఉద్యోగిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. పెద్దాయన అనే కనికరం కూడా లేకుండా.. దారుణంగా కొట్టారు. కాగా.. ఆయన పై దాడిచేసిన వారంతా శివసేన కార్యకర్తలుగా గుర్తించారు. సదరు విశ్రాంత నేవీ ఉద్యోగి.. ఇటీవల సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేని కించపరిచేలా..  ఓ సెటైరికల్ పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దీంతో.. దానిని చూసిన శివసేన కార్యకర్తలు ఆయనపై కోపంతూ ఊగిపోయారు. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారమంతా.. సమీపంలోని ఓ సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. కాగా.. సదరు నేవీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా.. ఈ దాడికి ముందే.. ఆయనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వచ్చినట్లు ఆయన చెప్పడం గమనార్హం. కాగా.. ఆయన ఈ ఘటన  అనంతరం తనపై దాడికి పాల్పడిన శివసేన నేత కమలేష్ కాదమ్.. ఆయన మద్దుతుదారులు మరో పది మంది యువకులపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.