న్యూఢిల్లీ: రిటైర్డ్ నేవీ అధికారి బలరాజ్ దేశా్ వాల్  ను ప్రదీప్ ఖోకర్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిటైర్డ్ నేవీ ఆఫీసర్ బలరాజ్ దేశ్ వాల్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.  ద్వారకలోని సెక్టార్ 12లోని అపార్ట్ మెంట్ ను దేశ్వాల్ అతని వ్యాపార భాగస్వాములు నిర్మించారు.

ప్రదీప్ ఖోకర్ ఈ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దేశ్ వాల్ కు ప్రదీప్ రూ. 5 లక్షలు బకాయి పడ్డాడు. ఆదివారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రదీప్ ఖోకర్ ఈ అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలానికి చేరుకొన్నాడు. 

బలరాజ్ దేశ్వాల్ తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని తట్టుకోలేక ప్రదీప్ ఖోకర్... దేశ్వాల్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు.అతి సమీపంతో కాల్పులు జరపడంతో బుల్లెట్లు దేశ్వాల్ శరీరం నుండి తూటాలు దూసుకెళ్లాయి.  ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగానే చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.

నిందితుడు ప్రదీప్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.