భువనేశ్వర్: తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోమనాథ్ పరిదాకు భువనేశ్వర్ లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 24 మంది సాక్షులు చెప్పిన విషయాల ఆధారంగా, శాస్త్రీయ బృందం అందించిన వివరాల ఆధారంగా ఖుర్దా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

రిటైర్డ్ ఆర్మీ అదికారి అయిన సోమనాథ్ (78) తన భార్య ఉషశ్రీ సామల్ (61)ను హత్య చేశాడు. ఓ కుటుంబ సంబంధమైన గొడవలో ఆమెను అత్యంత పాశవికంగా చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని 300 ముక్కలు చేసి, రసాయనాలను కలిపి ఆ ముక్కలను స్టీలు, గాజు టిఫిన్ బాక్సుల్లో దాచి పెట్టాడు.

ఆ సంఘటన 2013లో జరిగింది. తాను తల్లిని సంప్రదించలేకపోతున్నట్లు దంపతుల కూతురు భువనేశ్వర్ లోని తన మేనమామకు చెప్పడంతో సంఘటన వెలుగు చూసింది. కూతురు మేనమామను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అదృశ్యమైన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో సోదాలు చేశారు. వారికి ఇంట్లోని వివిధ చోట్ల శవం ముక్కలు కనిపించాయి. భర్తను పోలీసులు కస్టడీలోకి తీసుకుని చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ్తను ఝార్పద జైలులోనే ఉన్నాడు. స్థానిక కోర్టు తీర్పును అతని న్యాయవాది హైకోర్టులో సవాల్ చేయడానికి పూనుకున్నాడు.