సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ముఠాకక్షలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధూ హత్యకు రెండు రోజుల్లో బదులు చెబుతామంటూ మరో గ్యాంగ్ స్టర్ తెరమీదికి వచ్చాడు.
చండీగఢ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు sidhu moose wala హత్యతో పంజాబ్ లో మరోసారి ముఠా కక్షలు తెరపైకి వచ్చాయి. సిద్దు హత్యతన పనేనని గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్స్టర్ ఫేస్బుక్లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ తాజాగా మరో గ్యాంగ్ స్టర్ social mediaలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గ్యాంగ్ స్టర్ Neeraj Bawanaకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో నిన్న ఓ పోస్టు కనిపించింది. ‘సిద్దు నా సోదరుడి లాంటివాడు. అతడి murderకు రెండు రోజుల్లో బదులు చెబుతాం’ అని హెచ్చరిస్తూ ఆ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు ఎవరు పెట్టారు అన్నది స్పష్టత లేదు.
పలు హత్యలు, దోపిడీ కేసులను ఎదుర్కొంటున్న నీరజ్ ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాజస్థాన్ లలో అతడి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నీరజ్ భావ్నా ముఠా సభ్యుడైన భుప్పీ రానా ఫేస్బుక్ ఖాతాలోనూ ఇలాంటి హెచ్చరికలే కనిపించడం గమనార్హం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సిద్దు హత్య గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారనే విషయం తెలిసిందే. సిద్దు హత్య తామే చేశామంటూ బిష్ణోయ్ సన్నిహితుడు, ముఠా సభ్యుడైన గోల్డీబ్రార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బిష్ణోయ్ సన్నిహితుడు విక్కీ మిద్దుఖేడా గతేడాది మొహాలీలో హత్యకు గురయ్యాడు. అందులో సిద్దు మేనేజర్ శగన్ ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో శగన్ ప్రీత్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. విక్కీ హత్యకు ప్రతీకారంగానే బిష్ణోయ్ ముఠా ఈ దారుణానికి పాల్పడిన ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
బిష్ణోయ్ కూడా ప్రస్తుతం తిహాడ్ జైల్లోనే ఉన్నాడు. దీంతో హత్యకు అక్కడి నుంచే పథకం రచించి ఉంటారని భావిస్తున్నారు. హత్యలో పాల్గొన్న ఓ నిందితుడికి తీహాడ్ జైలు నుంచి ఫోన్ కాల్ రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సిద్దు హత్య నేపథ్యంలో తనను ఎన్కౌంటర్ చేసి చంపేస్తారని బిష్ణోయ్ ఆరోపించాడు. తనకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో జైల్లో అతడికి భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.
కాగా, ప్రముఖ పంజాబీ గాయకుడు sidhu moose wala హత్య తమ పనేనని కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ Lawrence Bishnoiతో కలిసి తాము ఈ కుట్ర పన్నినట్లు పేర్కొన్నాడు. అయితే Goldy Brar వ్యాఖ్యలను లారెన్స్ బిష్ణోయ్ కొట్టిపారేశాడు. ఈ murderలో తన ప్రమేయం లేదని పేర్కొన్నాడు. పలు కేసులు తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్... తనను కాపాడాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. విచారణ కోసం తనను పోలీసులకు అప్పగించవద్దు అని patiala న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.
ఒకవేళ అప్పగిస్తే పోలీసులు తనను నకిలీ ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాడు. గోల్డీ ఆరోపణలను ఖండిస్తూ ఇంతటి భారీ హత్యకు కుట్రను జైలులో నుంచి ఎలా ప్లాన్ చేస్తారని లారెన్స్ తరపున పిటిషన్ వేసిన న్యాయవాది ప్రశ్నించారు. లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు. బిష్ణోయ్ కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. వీరు పంజాబ్ లో వసూళ్ల దందా నడుపుతూ ఉండేవారు. దేశరాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో లారెన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. కాగా పలు కేసుల్లో లారెన్స్ అరెస్ట్ అయ్యి తీహాడ్ జైల్లో ఉన్నాడు. అనంతరం కెనడాకు పారిపోయిన గోల్డీ బ్రార్ అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ గొడవలు, హత్యల కారణంగానే తాజాగా సిద్దు మూసేవాలా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
