Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం.. మార్చి 31 వరకు పొడిగింపు !

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగిస్తూ తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Restrictions On International Passenger Flights Extended Till March 31 - bsb
Author
Hyderabad, First Published Feb 27, 2021, 11:43 AM IST

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగిస్తూ తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

"షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సేవలకు సంబంధించిన ఈ ఆంక్షలు 2021 మార్చి అర్థరాత్రి 11.59గం.ల వరకు అమల్లో ఉంటాయని విమానయాన సంస్థ తెలిపింది.

అయితే  కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక ఫ్లైట్స్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం భారత్ సుమారు 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్ కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. 

ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి పూర్తిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మే 25 నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్  కు అనుమతిచ్చింది. కానీ గత 11 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు నెలరోజుల వరకు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం. దీనికి కారణం తాజాగా దేశంలోని కొన్ని రాష్టాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండడమే. 

Follow Us:
Download App:
  • android
  • ios