జనారణ్యంలో ఓ మృగాడి వేటకు బలైన యువతి.. భీకారణ్యంలో.. క్రూరమృగాల నడుమ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడింది. ఒంటిమీద బట్టలు లేకుండా, గాయాలతో.. స్పృహతప్పి.. చివరికి దొరికింది. ఆమె బతికే ఉండడం చూసి పోలీసులు, వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.. కానీ చికిత్స తీసుకుంటూ...
రాజస్థాన్ : Rajasthanలో తాజాగా సంచలనం సృష్టించిన మహిళా అత్యాచార ఘటన విషాదాంతం అయ్యింది. 35 ఏళ్ల బాధితురాలు వారం రోజులు నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది. ఆమెను కాపాడి ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి వెంటిలేటర్ మీదే చికిత్స పొందుతోందని, దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆమె బ్రెయిన్ ఆక్సిజన్ ను తీసుకోవడం కష్టంగా మారిందని, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాధితురాలు కన్నుమూసిందని నాగౌర్ ఎస్పి రామ్మూర్తి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
ఫిబ్రవరి 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు తిరిగి రాలేదు. దీంతో అంతా వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అయితే రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకుండా పోయింది. ఈ కేసును దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చారు నాగౌర్ పోలీసులు. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి రహదారిని మూసేయడంతో ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది.విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం కదిలింది. ఈ లోపు ఫిబ్రవరి 10వ తేదీన అదే గ్రామ శివారులోని అడవిలో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా, గాయాలతో.. అచేతనంగా పడి ఉండడం కొందరు గుర్తించారు. అయితే ఆమె అప్పటికి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
మైనర్ సాయంతో మృగాడు…
అది దట్టమైన అడవి ఏరియా. అలా ఆమె అన్నేసి రోజులు స్పృహ లేకుండా ఉండటం పోలీసులను, డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ క్రూరమృగమూ ఆమెను ఏమీ చేయకపోవడమూ వారిని సంబ్రమానికి గురిచేసింది. వెంటనే ఆమెకు మంచి చికిత్స కోసం జైపూర్ తరలించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడిని అతనికి సహకరించిన మైనర్ లు ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు.
ఫిబ్రవరి 4వ తేదీన ఇంటికి బయలుదేరిన ఆమెను మైనర్ కుర్రాడి సాయంతో కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బండరాయితో ఆమెపై దాడి చేసి చనిపోయిందనుకుని దూరంగా అడవిలో ఆమె శరీరాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. ఎట్టకేలకు ఆమె వాంగ్మూలం సాయంతోనే పోలీసులు నిందితుడిని, సహకరించిన మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు నాగౌర్ ఎస్పీ.
ఇదిలా ఉండగా, తన lover 2 ఏళ్ల daughterను ఏడు నెలలుగా Tortureకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ లోని.. విజయనగరం కొత్తకోట సమీపంలో ఉన్న 26 ఏళ్ల Married womanను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలి పనులు చేసుకుని బతుకుతుంది. ఈ క్రమంలో నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఆమెకు ఓప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చిన్నా (29)తో పరిచయం ఏర్పడింది. అది Symbiosisకి దారితీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
ఏడు నెలలుగా బాలికను కొట్టడం, రక్కడం వంటి వికృత చేతులకు చిన్నా పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. కానీ, బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు, కాళ్లు, చేతులను చిన్నా కొరికేసాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుంది. చుట్టుపక్కలవారు ఏమైంది.. అని అడిగితే విషయాన్ని దాటవేసింది. అంగన్వాడి సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండ్ కు తరలించారు దిశ డీఎస్పీ టి. త్రినాథ్ తెలిపారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్ చేయిస్తామని చెప్పారు.
