బెంగాల్‌లో రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అరెస్ట్


రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు  ఇవాళ అరెస్ట్ చేశారు.

  Republic tv Journalist arrested by west bengal police in sandeshkhali lns

న్యూఢిల్లీ:రిపబ్లిక్ టీవీకి చెందిన ఓ జర్నలిస్టును పశ్చిమ బెంగాల్ పోలీసులు  సందేష్ ఖాళీలో అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

 

సందేష్‌ఖాళీ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.  ఈ విషయమై కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లను కోర్టు కోరింది. సందేష్ ఖాళీ, మణిపూర్ హింసాత్మక ఘటనలను  పోల్చలేమని కోర్టు పేర్కొంది.  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సోమవారంనాడు మహిళలు పాదయాత్ర చేపట్టారు.

జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ సోమవారంనాడు రాష్ట్రంలో పర్యటించారు.  ఇక్కడి మహిళలకు  స్థానిక పోలీసులపై నమ్మకం లేదన్నారు. కొంతమంది తృణమూల్  కాంగ్రెస్ నాయకులు  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తమ భూములను ఆక్రమించుకున్నారని సందేశ్ ఖాళీలో మహిళలు ఆరోపించారు.

ఈ విషయమై స్థానిక జిల్లా పరిషత్ సభ్యుడు షేక్ షాజహాన్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జనవరిలో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం షాజహాన్  ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో  ఈ బృందంపై దాడి జరిగింది.  అప్పటి నుండి షాజహాన్  పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత మహిళలు  షాజహాన్ పై  తీవ్ర ఆరోపణలు చేశారు.  ఈ కేసులో  ప్రధాన నిందితుల సహచరులు శిబ్ ప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్ధార్ లు అరెస్టైన విషయం తెలిసిందే.

సందేష్‌ఖాళీలో జరిగిన ఘటనలను రిపోర్టు చేసినందుకు గాను  రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా  బీజేపీ నేత ఈ ఆరోపణలు  చేశారు. తమ రిపోర్టర్ ను పబ్లిక్ ట్రాన్స్ పోర్టును కూడ ఉపయోగించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారని  రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్  అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios