Asianet News TeluguAsianet News Telugu

Republic Day:ఒక్క రోజు ముందే ప్రారంభం కానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు.. నేతాజీ జయంతి కూడా కలిసేలా..

గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebrations) ప్రతి ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలను ఒక్క రోజు ముందుగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. Netaji Birth Anniversaryని కూడా గణతంత్ర వేడుకల్లో భాగం చేసేలా మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 

Republic Day Celebrations will now begin from 23rd Include Netaji Birth Anniversary
Author
New Delhi, First Published Jan 15, 2022, 1:21 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebrations) ప్రతి ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలను ఒక్క రోజు ముందుగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జనవరి 23 నుంచే గణతంత్ర దినోత్స వేడుకలను మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసింది. తద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం (జనవరి 23) కూడా ఆ వేడుకల్లో చేర్చడానికి వీలు కలుగుతుంది. ఇక, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతిని ప్రతి సంవత్సరం 'పరాక్రమ్ దివస్'గా పాటించాలని మోదీ ప్రభుత్వం గతంలో నిర్ణయించి సంగతి తెలిసిందే.  

అయితే తాజాగా Netaji Birth Anniversaryని కూడా గణతంత్ర వేడుకల్లో భాగం చేసేలా మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ముఖ్యమైన అంశాలను స్మరించుకోవడం, వేడుకలను జరుపుకోవడంపై మోదీ ప్రభుత్వం దష్టి సారించినవాటికి అనుగుణంగా ఉందని ఆ వర్గాల వెల్లడించాయి. 

మోదీ పాలనలో వార్షిక వ్యవహారంగా మారిన ఇతర రోజులు.
ఆగస్టు 14 - విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవం
అక్టోబర్ 31- ఏక్తా దివస్ -జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ పటేల్ జయంతి)
నవంబర్ 15 - జంజాతీయ గౌరవ్ దివస్ (భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజు)
నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం
డిసెంబర్ 26- వీర్ బాల్ దివస్ (మొఘల్‌ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్‌ సింగ్‌ నలుగురు కుమారులకు నివాళిగా)

ఇక, భారత స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానం. ఆయన 1897 జ‌న‌వ‌రి 23న ఒడిశాలోని క‌ట‌క్‌లో జ‌న్మించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ సంస్థను స్థాపించి బ్రిటిషర్లను ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అనుహ్యంగా 1945 ఆగ‌స్ట్ 18న తైపీలో జ‌రిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్టుగా భావిస్తారు. అయితే నేతాజీ మరణంపై ఇప్పటికి వివాదం కొనసాగుతూనే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios