జమ్మూ కాశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ బాబు రామ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం మరణానంతరం అశోక్ చక్రను ప్రదానం చేశారు.  ఈ పురస్కారాన్ని బాబు రామ్ భార్య రీనా రాణి, కుమారుడు మాణిక్ అందుకున్నారు 

Republic Day 2022 : జమ్మూ కాశ్మీర్ పోలీస్ (jammu kashmir police) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (assistant sub inspector) బాబు రామ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం మరణానంతరం అశోక్ చక్ర (ashok chakra) ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బాబు రామ్ భార్య రీనా రాణి, కుమారుడు మాణిక్ ఈ అవార్డును అందుకున్నారు. ఆగస్ట్ 29, 2020న శ్రీనగర్‌లో (srinagar) జరిగిన ఆపరేషన్‌లో ASI బాబూ రామ్ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆయ‌న ఉగ్రవాదులను నిర్మూలించ‌డంలో శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. 

మే 15, 1972న జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లా మెంధార్ (poonch districe memdhar) సరిహద్దు పట్టణంలోని ధరణా గ్రామంలో జన్మించిన రామ్ త‌న పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత 1999లో జమ్మూ కాశ్మీర్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. రామ్ తన ప్రాథమిక ఇండక్షన్ శిక్షణను పూర్తి చేసిన తర్వాత జ‌మ్మూకాశ్మీర్ పోలీస్ (jammu kashmir police) లో భాగం అయిన కౌంటర్ మిలిటెన్సీ ఫోర్స్ అయిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)ని స్వచ్ఛందంగా ఎంచుకున్నారు. తరువాత ఆయ‌న జూలై 27, 2002న SOG శ్రీనగర్‌లో ట్రాన్స‌ఫ‌ర్ అయ్యారు. ఇందులో ఆయ‌న అనేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. 

శ్రీనగర్‌లోని వివిధ మిలిటెన్సీ వ్యతిరేక కార్యకలాపాలలో బాబు రామ్ అసాధారణ పనితీరును దృష్టిలో ఉంచుకుని ఆయ‌న‌కు రెండు అవుట్ ఆఫ్ టర్న్ పదోన్నతులు లభించాయి. ఆయ‌న ఉగ్ర‌వాదుల‌పై దాడి చేసే అడ్వాన్స్ పార్టీలో విధులు నిర్వహించారు. అయితే 2020 ఆగ‌స్టులో ఉగ్ర‌వాదుల‌కు జాయింట్ సెర్చ్ పార్టీ కి మ‌ధ్య‌ కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక బాబు రామ్ కూడ వీర మ‌ర‌ణం పొందారు. దీంతో ఈ ఎన్ కౌంట‌ర్ ముగిసింది. 

బాబు రామ్ ఉగ్ర‌వాద నిరోధక బృందంలో తన సేవలందిస్తున్న సమయంలో, వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 28 మంది ఉగ్రవాదులను కాల్చిచంపిన 14 ఎన్‌కౌంటర్లలో భాగమయ్యాడని అధికారులు తెలిపారు. అత్యుత్తమ సహకారం పరాక్రమానికి గాను ఆయనకు అశోక్ చక్రతో గౌర‌వించిన‌ట్లు చెప్పారు. అయితే ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఈ అవార్డు రావ‌డంతో బాబు రామ్ భార్య‌, కుమారుడు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పుర‌స్కారాన్ని అందుకున్నారు. గ‌తేడాది ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా జ‌మ్మూ కాశ్మీర్ స్పెష‌ల్ ఆపరేషన్స్ గ్రూప్‌కి చెందిన ASI బాబు రామ్‌కు రాష్ట్రపతి కోవింద్ అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డును ఆమోదించారు. 

అశోక్ చక్ర భారతదేశ‌ అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ పుర‌స్కారం. దీనిని యుద్ధభూమికి దూరంగా శౌర్యం, సాహసోపేతమైన చర్య, ప్రాణ‌త్యాగం చేసే వారికి ప్ర‌దానం చేస్తారు. అలాగే పరమ్ వీర్ చక్ర ను శాంతికాలం, అత్యంత ప్రస్ఫుటమైన ధైర్యసాహసాలకు, సాహసోపేతమైన శౌర్యం, లేదా ప్రాణ‌త్యాగం చేసే వారికి అందజేస్తారు.