పెళ్లి చేసుకోండి, అదే సమయంలో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకోండంటూ ఒక విధంగా దేశ ప్రజలకు బహిరంగ లైసెన్సు ఇవ్వడమేనని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బహు భార్యత్వాన్ని సమర్థిస్తుందా అని కాంగ్రెసు నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు. వివాహేతర సంబంధం నేరం కాదని అంటున్నారని ఆమె అంటూ ఈ తీర్పు మహిళలకు ఎలా మేలు చేస్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. వివాహేతర సంబంధాలను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా అనే విషయంపై వివరణ ఇవ్వారని ఆమె అన్నారు.
పెళ్లి చేసుకోండి, అదే సమయంలో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకోండంటూ ఒక విధంగా దేశ ప్రజలకు బహిరంగ లైసెన్సు ఇవ్వడమేనని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవాల్ అన్నారు.
ఇది మహిళా వ్యతిరేక తీర్పు అని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె చెప్పారు. ఇక పెళ్లి పవిత్రత ఏముంటుందని ఆమె ప్రశ్నించారు.