Asianet News TeluguAsianet News Telugu

ఇకపై కరెన్సీ నోట్లపైనా కూడా గాంధీ బొమ్మను తీసేయండి: మహాత్మా గాంధీ ముని మనవడు సంచలన ట్వీట్  

ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై గాంధీజీ ఫోటోను చిత్రాన్ని లేకుండా చేశారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం తీరుపై గాంధీ మునిమనవడు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక కరెన్సీ నోట్లనుంచి కూడా ఆయన చిత్రాన్ని తీసివేయండీ అంటూ ట్వీట్ చేశారు. 

Remove Bapu's image from notes too, Mahatma Gandhi's
Author
First Published Dec 28, 2022, 12:24 AM IST

ఇటీవల ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై  గాంధీజీ ఫోటోను పెట్టకపోవడంపై మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కరెన్సీ నోట్లపైనా కూడా గాంధీ ఫోటోను తీసేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే..  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తుషార్ అరుణ్ గాంధీ ట్విటర్‌లో వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ.. "కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై గాంధీజీ చిత్రాన్ని చేర్చనందుకు ఆర్ బీఐ( RBI)కి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు దయచేసి ఆయన ఫొటోని పేపర్ కరెన్సీపైనా తొలగించండి" అని పేర్కొన్నారు. మరి తుషార్ గాంధీ ట్వీట్ పై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరోవైపు..  తుషార్ గాంధీ ట్వీట్ పై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలియదు. కానీ.. తుషార్ గాంధీ ట్వీట్ పై నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు  తుషార్ గాంధీకి వ్యతిరేకంగా  కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ .. ‘ఒక్క గాంధీ ఫొటోనే ఎందుకు వేయాలి.. ఆ మాటకొస్తే కరెన్సీ నోట్లపై, కాయిన్లపై అందరు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను ముద్రించాలి ’ అని పేర్కొన్నాడు. మరో నెటిజన్  అయితే బాపూ? గతంలో జీవించటం మానేయండి. గాంధీజీ వారసత్వాన్ని దోపిడీ చేయటం మానేయండి.  దేశం కోసం ఏదైనా చేయండీ అంటూ కామెంట్ చేశారు. భారతదేశంలో ఎన్నో వారసత్వ చిహ్నాలున్నాయి..వాటిలో బేలూరు,హళేబుడు, కోణార్క్ వంటి చిహ్నాలను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ చేశారు మరో యూజర్.  .

ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ రూపీ)ని ఆర్బీఐ విడుదల చేసింది. దీన్నిరిటైల్, హోల్ సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ పట్టణాల్లో పరీక్షిస్తున్నారు. కాలక్రమేణా నోటు క్రమంగా అదృశ్యమవుతుంది. అందువలన, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ దేశంగా రూపొందించాలని భావిస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల డినామినేషన్లలో ఈ-రూపీ కూడా అందుబాటులోకి రానుంది. ఈ రూపీ వచ్చినా భౌతిక కరెన్సీ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి.
  
డిజిటల్ మనీ భవిష్యత్తు గురించి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ చాలాసార్లు ప్రస్తవించారు.  యుపిఐ వాలెట్‌ను కలిగి ఉండటానికి సిబిడిసి భిన్నంగా ఉందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ అనేది RBI యొక్క బాధ్యత. అయితే UPI అనేది చెల్లింపు సాధనం, UPI ద్వారా జరిగే ఏదైనా లావాదేవీ సంబంధిత బ్యాంక్ బాధ్యత. ఇది 24 గంటల్లో డబ్బును తిరిగి ఇచ్చే సామర్థ్యం వంటి నిర్దిష్ట ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది.

అంతేకాకుండా.. ఇది సరిహద్దు చెల్లింపు స్థలంలో ఆవిష్కరణను కూడా పెంచుతుంది. చైనా, స్వీడన్, దక్షిణ కొరియా వంటి కొన్ని ప్రారంభ CBDC ప్రయోగాలు ఇప్పటికే చాలా వరకు భౌతిక నగదుకు దూరంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ట్రాకర్ ప్రకారం.. ప్రపంచ GDPలో 95% ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ పర్యావరణ వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని తీసుకరావడానికి చర్యలు తీసుకున్నాయి. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు అధునాతన దశలో ఉండగా.. 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా అమల్లోకి తెచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios