ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాల నుంచి డార్విన్ సిద్ధాంతం, అవర్తన పట్టికను తొలగించలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కోవిడ్-19 సమయంలో కొంత భాగాలను మాత్రమే తొలగించారని తెలిపారు. 

ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాల నుంచి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నించారు. మహారాష్ట్రలోని పుణె నగరంలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించలేదని స్పష్టం చేశారు.

స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడి ఉండటం తప్ప ట్విట్టర్ కు మరో మార్గం లేదు - డోర్సీ ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందన

డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని సైన్స్ పుస్తకాల నుంచి ఎన్ సీఈఆర్ టీ తొలగించిందని, ఆవర్తన పట్టికను పక్కన పెట్టిందని ప్రస్తుతం వివాదం కొనసాగుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కానీ అలాంటిదేమీ జరగలేదని తాను బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. ఈ వివాదం మొదలైన వెంటనే తాను స్వయం ప్రతిపత్తి కలిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నాని చెప్పారు.

అమానవీయం.. యువకుడి మెడకు పట్టీ కట్టి, కుక్కల మొరగాలని బలవంతం.. మతం మారాలని ఒత్తిడి.. వైరల్

‘‘కోవిడ్-19 సమయంలో కొన్ని భాగాలను తగ్గించి, ఆ తర్వాత తిరిగి తీసుకురావచ్చని నిపుణులు సూచించారు. కాబట్టి 8, 9 తరగతుల్లో కంటెంట్ మారదు. 10వ తరగతి పుస్తకంలో పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన కొంత భాగాన్ని గత ఏడాది తొలగించారు. 11, 12 తరగతుల్లో మార్పు లేదు’’ అని మంత్రి తెలిపారు.

ఇప్పుడు యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది - ప్రధాని మోడీ

పదో తరగతి తర్వాత సైన్స్ చదవని విద్యార్థులు డార్విన్ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని నిర్దిష్ట సబ్జెక్టులను కోల్పోతారనే అభిప్రాయం ఉందని, ఇది సమంజసమైనదే అని ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. పీరియాడిక్ టేబుల్ ను 9వ తరగతిలో బోధిస్తున్నారని, 11, 12 తరగతుల్లో కూడా బోధిస్తున్నారని తెలిపారు. ఎన్ సీఈఆర్ టీ ప్రకారం ఒకటి రెండు ఉదాహరణలను (పరిణామ సిద్ధాంతానికి సంబంధించినవి) మినహాయించారని తెలిపారు. కానీ జాతీయ విద్యావిధానం అమలవుతోందని, ఆ విధానం ప్రకారమే కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నామని హామీ ఇచ్చారు.