న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు.ఈ ఘటన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాపై దాడిని ఆయన ఖండించారు.

also read:ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ ! తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసు..

కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీకి చెందిన మిత్రపక్షాలు ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు ఈ ఘటన ప్రజాస్వామ్యంలోని నాలుగో పిల్లర్ పై దాడిగా అభివర్ణించారు.

 

అర్నబ్ గోస్వామిని  బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో ఓ అర్కిటెక్ట్ అతని తల్లి ఆత్మహత్య చేసుకొన్నారు. గోస్వామి బకాయిలు చెల్లించని కారణంగానే ఈ ఆత్మహత్యలు చేసుకొన్నట్టుగా కేసు నమోదైంది.

ఈ కేసులో ఇవాళ అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.