Asianet News TeluguAsianet News Telugu

Prashant Kishore: "జంగిల్ రాజ్ గుర్తుకొస్తోంది..." బీహార్ రోడ్ల దుస్థితిపై విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్

Prashant Kishore: బీహార్‌లోని మధుబని లో పర్యటిస్తున్న ప్రశాంత్ కిషోర్.. ఆ జిల్లా గుండా వెళుతున్న జాతీయ రహదారి చిత్రాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ..  తనకు "1990ల నాటి జంగిల్ రాజ్"ని గుర్తుచేస్తుందని ప‌రోక్షంగా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.
 

Reminds of  Jungle Raj Of 1990s : Prashant Kishore On Madhubani Road
Author
Hyderabad, First Published Jun 24, 2022, 2:59 AM IST

Prashant Kishore: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌లోని రోడ్ల దుస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేశారు. బీహార్‌లోని మధుబని జిల్లాలోని ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఆ జిల్లాలోని రోడ్ల ప‌రిస్థితిపై సోషల్ మీడియా వేదిక‌గా కామెంట్ చేశారు. మ‌ధుబ‌ని జిల్లా గుండా వెళ్తున్న‌ జాతీయ రహదారి 227 (ఎల్) ఫోటోల‌ను షేర్ చేస్తూ..  90ల నాటి జంగిల్ రాజ్‌లో బీహార్‌లోని రోడ్ల పరిస్థితిని గుర్తుకు తెస్తుందని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఇటీవల, నితీష్ కుమార్ రోడ్డు నిర్మాణ శాఖ ప్రజలను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్‌లో రోడ్ల పరిస్థితి గురించి అందరికీ చెప్పాలని అన్నారు. "1990ల జంగిల్ రాజ్" అనేది నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధికారంలోకి రాక ముందు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి చెందిన లాలూ ప్రసాద్, రబ్రీ యాదవ్‌లకు పాల‌న సూచ‌న‌. 2005లో చట్టవ్యతిరేకత, రోడ్ల అధ్వాన్న స్థితి తెలుపుతూ  RJDని ప‌రోక్షంగా విమర్శించారు. 

 
ప్రశాంత్ కిషోర్ ట్వీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రానప్పటికీ, అతను పంచుకున్న వార్తాపత్రిక నివేదికపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. "ఆర్టికల్‌లో పేర్కొన్న ఎన్‌హెచ్‌పై పనిని ఎన్‌హెచ్‌ఏఐ పూర్తి చేస్తుంది. అయితే, రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పగించలేదు. పేర్కొన్న ప్రాజెక్ట్ పనులు రెండు వారాల్లో ప్రారంభమవుతాయి" అని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios