Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగులకు ఊరట: రెమ్‌డెసివర్ ధర తగ్గించిన కేంద్రం... రూ.899కే లభ్యం

దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా వున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించిన ఆయా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే కోవిడ్‌పై పోరులో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, రెమిడిసివర్ అనే ఇంజెక్షన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది.

Remdesivir now at Rs 899 ksp
Author
New Delhi, First Published Apr 17, 2021, 10:08 PM IST

దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా వున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించిన ఆయా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే కోవిడ్‌పై పోరులో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, రెమిడిసివర్ అనే ఇంజెక్షన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది.

కొవిడ్‌-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. దీంతో బ్లాక్‌ మార్కెట్‌ పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడగా, బయట మార్కెట్‌లో దీన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కరోనా రోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఔషధం ధరలను తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌ఏపీపీఏ) ఫార్మా కంపెనీలను కోరగా..  అందుకు ఆయా కంపెనీలు అంగీకరించాయి.  

మనదేశంలోని క్యాడిల్లా హెల్త్‌కేర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా బ్రాండ్‌లు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ధరను తగ్గించాయి. దీంతో కంపెనీలకు కేంద్ర మంత్రి ముఖేశ్‌ ఎల్‌ మాండవీయ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు.  

రెమ్‌డిసివర్‌ తగ్గిన ధరలు

1. క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రెమ్‌డాక్ రూ.2,800 నుంచి రూ.899కి తగ్గింది. ఇకపై రూ.899కి లభిస్తుంది.
2. సింజెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బయోకాన్ బయాలజిక్స్ ఇండియా) రెమ్‌విన్ రూ.3,950 నుంచి 2,450కి తగ్గింది.
3.  డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ రెడిక్స్ రూ.5,400 నుంచి రూ.2,700కు తగ్గింది. 
4. సిప్లా లిమిటెడ్ సిప్రెమి రూ.4,000 నుంచి రూ.3,000కు తగ్గింది.
5. మైలాన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెస్రెమ్ రూ.4,800 నుంచి రూ.3,400కు తగ్గింది.
6. జుబిలెంట్ జనరిక్స్ లిమిటెడ్ జుబి-ఆర్ రూ.4,700 నుంచి రూ.3,400కు తగ్గింది. 
7. హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ కోవిఫోర్ రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గింది. 

Follow Us:
Download App:
  • android
  • ios