జియో మరో బంపర్ ఆఫర్.. రోజుకి 5జీబీ డేటా

Reliance Jio launches new JioLink plans which offer 5GB data per day
Highlights

మరోసారి తక్కువ ధరకే ఎక్కువ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో లింక్స్ పేరిట కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న జియోలింక్‌ సర్వీసులపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

తన జియోలింక్‌ సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు. ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్‌ ప్రయోజనాలు ఉండవు. 

తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది. అంటే మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఇక రెండో ప్లాన్‌ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. 

రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్‌ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు. 
 
సగం వార్షిక ప్రాతిపదికన మూడో ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. అది 4,199 రూపాయల ప్లాన్‌. ఈ ప్లాన్‌ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.  ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 5 జీబీ డేటాను, అదనంగా 96 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076 జీబీ డేటాను పొందనున్నారు. ఈ మూడు ప్యాక్‌లపై జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. 

 

loader