బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్, ముఖేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. ‘‘అమిత్ భాయ్.. మీరు నిజమైన కర్మయోగి.. అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. అప్పుడు గుజరాత్, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోంది. దేశం ఇప్పుడు రక్షణ కవచాల్లో ఉందన్నారు.

విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన ముఖేశ్.. ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పారచుకోండి.. మీ లక్ష్యం నుంచి ఎప్పుడు వెనకడుగు వేయకండని ఆయన పిలుపునిచ్చారు. మీ కలలను సాకారం చేయడానికి భారత్ సన్నద్ధమవుతోంది.

భారత ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలన్న ప్రధాని మోడీ కల ఆహ్వానించదగినదేనని ముఖేశ్ అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2014 వరకు భారత ఆర్ధిక వ్యవస్థను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని.. కానీ గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధగా రూపొందించామని స్పష్టం చేశారు.