హానీమూన్ కి ఆశపడితే జైలు పాలయిన ఓ జంట విషాదగాథ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. వివరాల్లోకి వెడితే ముంబైకు చెందిన శరీఖ్, ఒనీబాలకు గతేడాది జూన్ నెలలో వివాహం జరిగింది. ఈ కొత్త జంటకు వారి బంధువులు తబస్సం రియాజ్ ఖురేషీ వారికి పెళ్లి గిఫ్ట్ గా హనిమూన్ ఏర్పాటు చేసాడు. దానికోసం ఖతార్ పర్యటనకు అన్ని ఏర్పాటు చేశారు. 

వీరు 2019 జులై 6 న హనిమూన్ కి బయలుదేరారు. ఈ కొత్తజంట ఖతార్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అక్కడి కస్టమ్స్ అధికారులు వారి సామాన్లను చెక్ చేశారు. అందులో వారికి నాలుగు కిలోల మాదకద్రవ్యాలు లభించాయి. వారి సామాన్లలో తబస్సం రియాజ్ ఖురేషీ వాటిని పెట్టినట్టు వారికి తెలియదు.

దాంతో కస్టమ్స్ అధికారులు వారిని విచారించారు. దాంతో మాకు తెలియదని, అవి ఎలా ఇందులోకి వచ్చాయో తెలియదని చెప్పుకొచ్చారు. అయినా కస్టమ్స్ అధికారులు వినకుండా వారిని తీసుకెళ్లి జైలులో వేశారు. ఈ జంటకు పదేళ్ల జైలు శిక్షను విధించి, దానితో పాటుగా కోటి రూపాయల జరిమానా కూడా విధించారు. 

దీంతో ఆ జంట చేయని తప్పుకు ఖతార్ జైలులో శిక్ష అనుభవించింది. అయితే ఆ తర్వాత అధికారుల విచారణలో ఆ జంట తప్పేం లేదని తేలింది. దీంతో దౌత్యపరమైన మార్గాల ద్వార వాళ్లను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.