Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ ముప్పు: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేత

దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం ఆధ్యాత్మిక రంగంపై పడింది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. తాజాగా కాశ్మీర్‌లోని ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రను కరోనా దెబ్బకొట్టింది

Registration For Amarnath Yatra Temporarily Suspended Due To Covid Crisis ksp
Author
Srinagar, First Published Apr 22, 2021, 8:17 PM IST

దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం ఆధ్యాత్మిక రంగంపై పడింది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. తాజాగా కాశ్మీర్‌లోని ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రను కరోనా దెబ్బకొట్టింది.

దేశంలో కరోనా నేపథ్యంలో వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్లు పునరుద్దరిస్తామని వెల్లడించింది. 

Also Read:నా భార్య చనిపోతోంది.. ప్లీజ్ చేర్చుకోండి: కంటతడి పెట్టిస్తోన్న ఓ భర్త ఆక్రందన

జూన్‌ 28 నుంచి 56 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఏప్రిల్‌ 15నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి ఏటా జరిగే అమర్‌నాథ్ యాత్ర గత రెండేళ్లుగా జరగడం లేదు. 2019లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో నెలకొన్న పరిస్థితులు కారణం కాగా.. 2020లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో యాత్రను రద్దుచేసిన సంగతి తెలిసిందే. 

కాగా.. గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణంగా దేశంలో 2,102 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా రిపోర్టు ప్రకారం.. బుధవారం 3,15,925 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మూడు లక్షల మార్క్ చేరకోవడం తో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలా మూడు లక్షల కేసులు అమెరికాలో జనవరిలో నమోదు కాగా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి భారత్ లో చోటుచేసుకోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios