సాంకేతిక కారణాలతో షాట్ సర్యూట్ ఏర్పడి రిఫ్రిజిరేటర్ పేలిపోయిన సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ పేలుడు దాడికి నలుగురు మృత్యువాతపడగా మరికొంత తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. షాట్ సర్యూట్ కారణంగా రిప్రిజిరేటర్ కంప్రెషర్ పేలిపోయింది. ఈ పేలుళ్ల కారణంగా ఇళ్లు మొత్తం దగ్దమయ్యింది. ఇంట్లోని వారందరు నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మిగతా కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

భారీ శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.