కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. 2024 ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఆమె తాజాగా కాంచీపురం జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ కొందరు గృహిణులు ఆమె చుట్టూ చేరి వంట గ్యాస్ ధరను తగ్గించాలని కోరారు. వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ల నిర్ణయిస్తాయని కేంద్ర మంత్రి వారికి సమాధానం చెప్పారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం తమిళనాడులో పర్యటన చేస్తున్నారు. తమిళనాడులో 2024 ఎలక్షన్ కోసం వాల్ టు వాల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తమిళ వీధుల్లో తిరిగారు. కొందరు మహిళలు ఆమె చుట్టూ చేరి వారికి తోచిన ప్రశ్నలు వేశారు. వంట గ్యాస్ ధర బాగా పెరిగిపోయిందని ఆమెతో అన్నారు. ఆ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓపికగా సమాధానం చెప్పారు.

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో పళైయసీవరం గ్రామానికి వెళ్లారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆ గ్రామంలో వారి చుట్టూ కొందరు గృహిణులు చేరారు. వారి సమస్యను వెల్లడించారు. వంట గ్యాస్ ధర తగ్గించాలని కోరారు. వారికి సమాధానం చెబుతూ సిలిండర్ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని చెప్పారు.

‘మన దేశంలో వంట గ్యాస్ లేదు. మనం ఆ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటాం. మన దిగుమతి చేసుకుంటాం కాబట్టి.. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ గ్యాస్ ధర తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. కానీ, గత రెండు సంవత్సరాలుగా ధరలు తగ్గడం లేదు’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

Also Read: వారు నలుగురూ గుజరాత్ వాసులే.. యూఎస్-కెనడా సరిహద్దులో చనిపోయిన భారత కుటుంబం..

ఆమె స్థానికంగా ఉన్న ఓ బీజేపీ నేత ఇంటికి వెళ్లారు. అక్కడ కమలం పూవు పెయింట్ వేసి.. తన క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.