దేశ వ్యాప్తంగా నగరంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కాగా.. ముంబయిలో ఈ ప్రభావం మరికాస్త ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ముంబయిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబయి నగరంలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించారు.

వాతావరణ శాఖ అధికారుల హెచ్చిరకల నేపథ్యంలో.. ముంబై నగరంలో గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముంబై నగరంతోపాటు రాయగడ్, రత్నగిరి, సతారా, సాంగ్లీ జిల్లాలో గురువారం అతి భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై నగరవాసులకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు. భారీవర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.